బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహణ..
కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు..
కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళిక లో భాగంగా సోమవారం రోజు బడంగ్ పేట్ నగర పాలక సంస్థలో కమిషనర్ పి. సరస్వతి అధ్వర్యంలో 36వ రోజు కార్యకలాపాలలో భాగంగా బడంగ్ పేట్ కమీషనర్ కార్యలయంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులతో మహిళ శక్తి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడంగ్ పేట్ కమీషనర్ మాట్లాడాతూ.. బ్యాంక్ లింకేజి ద్వారా ఎస్.జీ.హెచ్. మహిళలకు మహిళా శక్తి పధకము (కింద బ్యాంక్ లోన్స్ ఇప్పించి, మహిళాభివృద్ధికి తోడ్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరము 2025 – 26కు గాను బడంగపేట్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఇందిరా మహిళా శక్తి వ్యక్తిగత యూనిట్లకు గాను 4 కోట్ల 16 లక్షలు రూపాయాల రూణాలు టార్గెట్ కాగా.. 30 లక్షల రూపాయల రుణాలు ఇప్పించడం జరిగింది.. అలాగే (గూపు యూనిట్లకు గాను 4 కోట్ల రూపాయాల రుణాలు టార్గెట్ కు గాను ఇప్పటి వరకు 18 లక్షలు రుపాయాలు రుణాలు ఇప్పించడం జరిగింది.. మిగిలిన టార్గెట్ లో 50 శాతం వంద రోజుల కార్యచరణలో పూర్తి చేయాలని కమీషనర్ ఆర్.పీ.లకు, ఓబీలకు సూచించడం జరిగింది.
తదనంతరం కమీషనర్ బట్టేల్ గుట్ట సమీపంలో గల స్కూల్ యూనిఫార్మ్ స్టిచింగ్ సెంటర్ ను సందర్శించడం జరిగింది.. అలాగే వివిధ వార్డులలో 17 ప్రభుత్వ పాఠశాలలో గల 4050 మంది విద్యార్థులకు జున్ 12 వ తారీఖున మొదటి విడతలో ఒక జత స్కూల్ యూనిఫార్మ్ లు ఇవ్వడం జరిగింది.. రెండవ జత 4050 స్కూల్ యూనిఫార్మ్ లు కటింగ్ పూర్తి అయి ప్రస్తుతం స్కూల్ యూనిఫార్మ్ లు కుట్టడం జరుగుతుంది. అట్టి రెండవ జత స్కూల్ యూనిఫార్మ్ లు మరొక వారంలో పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలకు అందజేయడం జరుగుతుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి. జిఎఫ్. జాన్ కృపాకర్, ఎస్.ఐ. వంకాయల యాదగిరి, టి.ఎం.సి. కె. మమత, టి.ఎం.సి. ఎన్ నాగేశ్, ఆర్. శంకర్, ఈఈ మౌనిక, వార్డు ఆఫీసర్లు, ఆర్.పీ.లు, ఓబీ లు, ఎస్.జీ.హెచ్ మహిళలు పాల్గొన్నారు..