డిమాండ్ చేసిన తీ.డబ్ల్యు.జె.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్..
హనుమకొండ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత..
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి .వి. రాజు గౌడ్, అంతడపుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ దృష్టికి వర్కింగ్ జర్నలిస్టులు వృత్తిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలా మంది జర్నలిస్టులు దాదాపు దారిద్య్రరేఖకు దిగువన ఉండి ఈ వృత్తిని కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను కథనాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తూ జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తమ సమస్యలు, హక్కులను ప్రభుత్వ దృష్టికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలని కోరారు. జిల్లాలో గత 20 ఏళ్ళుగా జర్నలిస్టులకు నివేషణ స్థలాలు ఇవ్వలేదని కేవలం రెండు జర్నలిస్టు సొసైటీలకు ప్రభుత్వం భూమి కేటాయించిందని అది కూడా అన్యాక్రాంతం అవుతుందని దాన్ని కాపాడాలని కలెక్టర్ ని కోరారు. అలాగే గత 20 ఏళ్లుగా ఏ సొసైటీలో లేని జర్నలిస్టులకు కూడా నివాస స్థలాలు అందజేయాలని, ఇప్పటి వరకు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించి వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని కోరారు.. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి.
జర్నలిస్టులపై దాడుల నియంత్రణకై జిల్లా స్థాయి కమిటీని నియమించాలి. జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వం గతంలో రెండు సొసైటీలకు కేటాయించిన భూమిని అన్యక్రాంతం కాకుండా ఆర్డీవోలతో సమావేశం ఏర్పాటుచేసి కాపాడుతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ హనుమకొండ జిల్లా కోశాధికారి ఈసంపెల్లి రమేష్, సంయుక్త కార్యదర్శి ఈర్ల తిలక్, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు గిరెడ్డి అనిల్ రెడ్డి, కార్యదర్శి దామెర వెంకటేష్, సంపత్ రెడ్డి, అంకేశ్వరపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.