Monday, November 23, 2026
Google search engine
Homeతెలంగాణవసూళ్ల రాణి.. నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు!

వసూళ్ల రాణి.. నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు!

ఎల్బీనగర్

గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నీకు బీఫామ్ ఇచ్చి, కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పిస్తే, నీ విజయం కోసం ఎంతోమంది కార్యకర్తలు నిస్వార్థంగా కష్టపడి పనిచేశారు. వారి శ్రమను, నమ్మకాన్ని గుర్తించకుండా నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ మూడున్నర సంవత్సరాల రాజకీయ జీవితంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలు మారిన చరిత్ర నీది మాజీ కార్పొరేటర్ సుజాత నాయక్.. నీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నమ్మకాన్నే వమ్ము చేసిన నువ్వా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి మాట్లాడేది, రాజకీయాల్లో విమర్శలు చేసే ముందు నీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. గతంలో నువ్వు కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు ఎవరమ్మా వసూళ్లు చేసింది? రెండు, మూడు సార్లు నిన్ను, నీ పక్కన ఉండే పీఏను ప్రజాక్షేత్రంలో ఉంటూ వసూళ్లు మానుకోవాలని సుధీర్ రెడ్డి మందలించింది వాస్తవం కాదా? అయినా మీరు వసూళ్ల దందా ఆపకపోవడంతో సుధీర్ రెడ్డి మిమ్మల్ని మరోసారి గట్టిగా మందలించారు. దీంతో మీ ఆటలు సాగవని, మీరు బయటకు వచ్చి పార్టీ మారి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జనాలకు తెలియదా?రోజూ వసూళ్లు చేసి నీకు రోజుకు రూ.20 వేల రూపాయలు తెచ్చి ఇస్తున్న బ్రోకర్ గాడి అరాచకాలు జనాలకు తెలియవు అనుకుంటున్నారా?పాపం, మీ భర్త రాంచందర్‌ను కొట్టింది నువ్వా? నీ పీఏనా? మీ దౌర్జన్యాలు భరించలేక ఆయన మీకు దూరంగా గత మూడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారని జనాలు గుసగుసలాడుతున్నారు. ముందు వాటికి సమాధానం చెప్పండి. అయినా మాకు మీ కుటుంబ విషయాలతో ఏమి పని?గతంలో నందనవనం ఖాళీ స్థలంలో షెడ్లను తొలగించి, ఇప్పుడు నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అర్హులైన 18 మంది లబ్ధిదారులకు మీ నాయకుడు మధు యాష్కీతో చెప్పి ఇళ్లు ఇప్పిస్తానని నమ్మబలికి, రూ.5 లక్షలు ఇస్తే ఇప్పిస్తానని చెప్పి వారిని నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నది వాస్తవం కాదా?గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించి లబ్ధిదారులకు అందించారు. మీలాగా పేదలను మోసం చేసి డబ్బులు వసూలు చేయలేదు. వసూళ్ల రాణి, పిచ్చి వాగుడు మానుకోకపోతే నీకు, నీ వెంట ఉండే పీఏకు చెబుతున్నాం — జాగ్రత్తగా ఉండండి. ఇదే మా బీఆర్ఎస్ నాయకుల చివరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ నాయక్, డివిజన్ అధ్యక్షులు సత్యం చారి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, రమాదేవి, దీపా చావన్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments