Home తెలంగాణ విజయవంతంగా ముగిసిన భా.రా.సా. నియోజకవర్గ సమావేశం..

విజయవంతంగా ముగిసిన భా.రా.సా. నియోజకవర్గ సమావేశం..

0
106
Former Minister Sabitha Indra Reddy and MLA Sudheer Reddy participated as chief guests..
Former Minister Sabitha Indra Reddy and MLA Sudheer Reddy participated as chief guests..

ముఖ్య అతిధులుగా పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
కేసీఆర్ పాల్గొనే వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై సమగ్ర చర్చ..

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,
ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కార్తిక్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.. కాగా వరంగల్ లో జరిగే ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు, లాజిస్టిక్స్, కార్యకర్తల సమీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్ర చర్చ జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here