Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణవెహికల్ అండర్ పాస్ లకు బదులుగా ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టాలి..

వెహికల్ అండర్ పాస్ లకు బదులుగా ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టాలి..

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఇదే సులువైన మార్గం..
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేసిన మల్ రెడ్డి రాంరెడ్డి..

విజయవాడ హైవేలో చింతలకుంట నుండి ఆటోనగర్ వరకు , భాగ్యలత నుండి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు ఫ్లైఓవర్ లు నిర్మించాల్సిందిగా కోరుతూ వివిధ కాలనీ వాసులు రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాలనీ వాసులతో కలిసి మల్‌రెడ్డి రాంరెడ్డి కలిశారు.

జనాభా తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో రద్దీ నియంత్రణ కోసం వెహికల్ అండర్ పాస్ లకు బదులుగా ఫ్లైఓవర్ లు ఎంతో అవసరమని, ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు, కాలనీ వాసులకు సులభంగా రోడ్లు దాటేలా ఫ్లైఓవర్ లు నిర్మించాలని రాంరెడ్డి మంత్రి వెంకట్ రెడ్డి స్థానిక ప్రజల తరఫున వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 11, 12 తేదీలలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments