కాలనీలో పర్యటించి, పనులు పర్యవేక్షించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
లెవెల్స్ సరిచూసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచన..
శుక్రవారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ కాలనీలో నూతన రోడ్లు పనులు ప్రారంభించిన నైపద్యంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కాలనీ సభ్యులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. లెవెల్స్ సరి చూసుకుంటూ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని.. కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు..
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఏఈ గోపాలకృష్ణ, వైదేహి నగర్ కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఎస్ కే డి నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ కిషన్ రావు, జంగారెడ్డి, కోశాధికారి శివరాం ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ టి నరసింహ రెడ్డి, సీనియర్ సిటిజన్ కోశాధికారి జయ రామ కృష్ణ శర్మ, శ్రీధర్, మాలాద్రి, పార్టీ నాయకులు శ్రీధర్ రావు, కాంతారావు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు..