Monday, June 30, 2025
Google search engine
Homeతెలంగాణశ్రీ భారతి విద్యాలయ స్కూల్ లో ఘనంగా బడ్డి బెంచ్ కార్యక్రమం..

శ్రీ భారతి విద్యాలయ స్కూల్ లో ఘనంగా బడ్డి బెంచ్ కార్యక్రమం..

ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ స్పందన..
పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే బడి బెంచ్ ప్రోగ్రాం..
కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ సరిత, స్కూల్ స్టాఫ్..

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్, వినాయక హిల్స్ లోని శ్రీ భారతి విద్యాలయ స్కూల్ లో ఘనంగా పాఠశాల యాజమాన్యం బడ్డి బెంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఒంటరితనానికి లోనవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి పక్కన వెళ్లి కూర్చొని, సంభాషణ మొదలుపెట్టి, వారి ఒంటరితనాన్ని పోగొట్టుకునేటట్లు చేయడమే ఈ బడ్డి బెంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ చివరి కార్యక్రమంగా న్యూట్రిషన్ కాన్సెప్ట్ పైన బడ్డి బెంచ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ స్పందన హాజరయ్యారు.. న్యూట్రిషన్ పైన పిల్లలకు, అలాగే తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించి వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఆమె సంభాషించడం జరిగింది. అలాగే విద్యార్థులు, తల్లి దండ్రులు డాక్టర్ స్పందనతో తమ యొక్క సందేహాలను తెలిపి వారినుంచి అమూల్యమైన సమాచారాన్ని పొందారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలిలో విద్యార్థులు ఉబకాయానికి లోనవుతూ అనేక వ్యాధులకు గురవుతున్న నేపథ్యంలో డైట్ పైన చక్కగా విశ్లేషణ చేశారు డాక్టర్ స్పందన.. ఈ కార్యక్రమంలో భారతి విద్యాలయ ప్రిన్సిపల్ సరిత, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments