హామీ ఇచ్చిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
కాలనీలో రోడ్లు అభివృద్ధి చేసినందుకు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు..
సోమవారం రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కాలనీలో పర్యటించారు.. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో 27,00,000 లక్షల రూపాయలతో రోడ్లు అభివృద్ధి చేసినందుకు కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.. అనంతరం కాలనీలో కొంతమేర రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని, నూతన కరెంటు స్తంభాలు వేయించాలని, వీధిదీపాలు పెట్టించాలని కాలనీ సభ్యులు కార్పొరేటర్ ని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. త్వరలోనే కాలనీలో ఒకటొకటిగా ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ట్రెజర్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ప్రసాద్, నాగమణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లా రెడ్డి, భూపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రంగ రెడ్డి, లక్ష్మీ నారాయణ, కృష్ణ, పుష్పాల్ రెడ్డి, రాధ కృష్ణ, పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..