Tuesday, February 17, 2026
Google search engine
Homeతెలంగాణషాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

రంగారెడ్డి జిల్లా:
16 : షాద్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన 25వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.ప్రమాణ స్వీకారకార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ కమిషనర్ సునీత,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానికులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments