Saturday, September 26, 2026
Google search engine
Homeతెలంగాణసరూర్ నగర్ చెరువులో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం

సరూర్ నగర్ చెరువులో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం

ఏర్పాట్లను పరిశీలించిన ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

ఎల్బీనగర్:

గణేష్ నిమజ్జన వేడుకలు సరూర్నగర్ చెరువుకట్టపై కొనసాగుతున్నాయి. నవరాత్రులు పూజలందుకొని గంగమ్మ ఒడికి చేరుకునే గణనాథుడికి ప్రజలు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడిప్పుడే నిదానంగా చెరువు కట్ట పైకి భక్తులు వినాయకులను తీసుకొని నిమజ్జనం కోసం రావడం జరుగుతుంది. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, డీసీ శ్రీనివాస్, ఈఈ కార్తీక్, విజయ్ కుమార్, చందన, బుచ్చయ్య, ఎస్ఎఫ్ఏలు, ఎంఎంసీ, రాంకీ సిబ్బందితో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.à భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సరూర్నగర్ చెరువు కట్టపై నిమజ్జనం కోసం ఎనిమిది భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగిస్తున్నారు. చెరువులో నిమజ్జన సందర్భంగా వేసిన విగ్రహాలను తొలగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments