Saturday, September 5, 2026
Google search engine
Homeతెలంగాణసరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఎస్.ఐ.ఆర్. ప్రత్యేక పత్రాల సేకరణ మేళా

సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఎస్.ఐ.ఆర్. ప్రత్యేక పత్రాల సేకరణ మేళా

ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల నమోదు ప్రక్రియ ముమ్మరం

హైదరాబాద్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) ప్రక్రియలో భాగంగా, సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక డాక్యుమెంట్స్ కలెక్షన్ మేళా నిర్వహించబడుతోంది. సెప్టెంబర్ 05, 06 తేదీలలో (శనివారం మరియు ఆదివారం) ఈ కార్యక్రమం కొనసాగనుంది.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు సకాలంలో సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ప్రత్యేక మేళాను ఏర్పాటు చేశారు.

*సమర్పించవలసిన ధృవీకరణ పత్రాలు:
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వద్ద లభ్యమయ్యే కింది పత్రాలలో ఏదో ఒకదానిని లేదా అవసరమైన వాటిని సంబంధిత కేంద్రాలలో అందజేయవచ్చు:

  • జనన ధృవీకరణ పత్రం
  • కుల ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్
  • భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు
  • ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ ఐడీ కార్డు
  • పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా తత్సమాన విశ్వవిద్యాలయ విద్యా అర్హత పత్రాలు
    ఓటర్లకు నిర్ణయించిన విచారణ తేదీతో సంబంధం లేకుండా, పత్రాలు సిద్ధంగా ఉన్నవారు ఈ రెండు రోజుల్లో (సెప్టెంబర్ 5, 6 తేదీలలో) నేరుగా కేంద్రాలను సందర్శించి తమ పత్రాలను ముందస్తుగా అందజేయవచ్చు.

పత్రాల సేకరణ కేంద్రాలు:
ఓటర్ల సౌకర్యార్థం సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో కింది నాలుగు ప్రాంతాలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు:

  • కొత్తపేట మహిళా భవన్
  • సాయినగర్ కమ్యూనిటీ హాల్
  • ఫణిగిరి కమ్యూనిటీ హాల్
  • చైతన్యపురి కమ్యూనిటీ హాల్
    ఎస్.ఐ.ఆర్. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పత్రాలను నిర్ణీత కేంద్రాలలో సమర్పించి దేశ సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments