Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ..

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ..

ముఖ్యమంత్రి చేతులమీదుగా కార్యక్రమం..
పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు..
హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్..

బహుజన వీరుడు, మొగలుల పాలనను ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ మహోత్సవం ఈ రోజు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించడం జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క గారు, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు..

అనంతరం రవీంద్రభారతిలో జరిగిన జయంతి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ… మహనీయుడి విగ్రహ భూమి పూజలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు.


సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర, ఆయన గొప్పతనం చాలా కాలంగా మరుగున పడిపోయిందన్నారు. గోల్కొండ కోటను పాలించిన ఆ మహనీయుడికి ఇన్నాళ్లు సరైన గౌరవం దక్కలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారికి గుర్తింపునిచ్చేలా విగ్రహం ఏర్పాటుతోపాటు, ప్రభుత్వపరంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రజలలో ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్ర పుటల్లో నిలిచేలా, భావితరాలకు పాపన్న చరిత్ర తెలిసేలా విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనలు తెలియజేస్తున్నాను. వీరుల చరిత్ర దాస్తే దాగదు అని.. చీకటిని చీల్చుకుంటూ వెలుగులా బయటికి వస్తుందని.. ఇందుకు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఉదాహరణ అన్నారు. బహుజనుల పక్షాన నిలబడి పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బహుజనలందరం అండగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి.. రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, అవకాశాలను బహుజన వర్గాలు సాధించుకునేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments