ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో, శ్రీకర హాస్పిటల్ వారి సహకారంతో వివేకానంద నగర్ బస్ స్టాప్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ ద్వారా ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు అందించడం సంతోషకరమని అన్నారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షులు ఎద్దు మోహన్, బీజేపీ సీనియర్ నాయకులు నందికొండ గీతారెడ్డి, మురళి, బాబు చౌదరి, సిరి, సతీష్, రూప్ లాల్, రత్నం, షేక్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.


