జిహెచ్ఎంసి అప్రమత్తంగా పనిచేయాలి..
డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత..
శుక్రవారం రోజు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులకు ముఖ్య సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “జిహెచ్ఎంసి ఎమర్జెన్సీ మాన్సూన్ టీములు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ప్రాంతంలో నియమిత బృందాలు చురుకుగా స్పందిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండాలి,” అని ఆదేశించారు.
అలాగే, మ్యాన్ హోల్స్, నీటిలో మునిగిపోయే ప్రాంతాలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు కూడా అవసరం లేనిపక్షంలో బయటికి వెళ్లకుండా, విద్యుత్ స్తంభాలు, నీటి ప్రవాహ ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. “ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు,” అని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.