ఎల్బీనగర్:
తీవ్రమైన వెన్నుపూస, కడుపునొప్పితో కొంతకాలంగా బాధ పడుతున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పరిధిలోని వెంకటరమణ కాలనీ, రోడ్ నంబర్ 07కు చెందిన కుడుముల రాధికా రెడ్డి (43), భర్త ప్రభాకర్ రెడ్డి. ఆమె కొంతకాలంగా తీవ్రమైన వెన్నుపూస నొప్పి, కడుపునొప్పితో బాధ పడుతోంది. ఈ క్రమంలో నవంబర్ 15వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది.కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమార్తె హృషికా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


