శేరిలింగంపల్లి :
నల్లగండ్ల డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ తాజ్ నగర్లో తాగునీటి సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మరియు నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీలో బోర్ ఏర్పాటు చేయించారు.ఈ నేపథ్యంలో నేడు నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ను ప్రారంభించి, నీటిని విడుదల చేయడంతో కాలనీ ప్రజలకు తాగునీటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చి సహకరించిన కొమిరిశెట్టి సాయిబాబాకి, రాగం హరి శంకర్ యాదవ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్ నాయక్, మోహన్ నాయక్, ఎం. శంకర్, ఎం. హిరియా, ఎం. రాజు, ఎం. రవి, ఎం. జంపా, లోకేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



