Thursday, July 30, 2026
Google search engine
Homeతెలంగాణగురు పౌర్ణమి వేళ సాయిబాబా సన్నిధిలో తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి...

గురు పౌర్ణమి వేళ సాయిబాబా సన్నిధిలో తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ప్రత్యేక పూజలు

రాష్ట్ర ప్రజల సుఖసభివృద్ధి కోసం బాబాను వేడుకున్న చైర్మన్

హైదరాబాద్:

పవిత్ర గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారి సన్నిధిలో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన మనసారా ప్రార్థించారు. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్రం సమస్త రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తూ మరింత వేగంగా అభివృద్ధి సాధించాలని సాయిబాబాను వేడుకున్నారు.
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని ఉద్ఘాటించారు. గురువులు చూపిన సన్మార్గం, అందించిన మార్గదర్శకత్వమే మన జీవితానికి దిక్సూచి అని, గురువుల పట్ల నిత్యం కృతజ్ఞతాభావాన్ని చాటుకోవాల్సిన పవిత్రమైన రోజే గురు పౌర్ణమి అని ఆయన కొనియాడారు.
ఆలయానికి విచ్చేసిన చైర్మన్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రులయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments