ఎల్బీనగర్:
సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ సర్కిల్ల పరిధిలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాల పరిశీలన ప్రక్రియను ఎంఎంసీ రెవెన్యూ సిబ్బంది చేపట్టారు. పెన్షన్ల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ, దరఖాస్తుదారులు సమర్పించిన ధ్రువపత్రాలు, వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని గుర్తించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులకు అవసరమైన సూచనలు చేస్తూ, పెన్షన్ల మంజూరుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.



