Home తెలంగాణ జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి..

జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి..

0
జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి..
Ranga Reddy District, Legal Services Organization, Secretary Sridevi..

సూచించిన రంగారెడ్డి జిల్లా, న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి శ్రీదేవి..
రాజీ మార్గమే రాజమార్గం అని పిలుపు..

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు మార్చి 8న అంటే రెండవ శనివారం రోజున రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ, కోర్టులయందు పెండింగ్ లో ఉన్న కేసులు కానీ, పరిష్కరించుకునే లేదా రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్. లోక్ అదాలత్ లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసు లోక్ అదాలత్ కు పంపబడి, ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే, వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. ఈ లోక్ అదాలత్ ల ద్వారా సమయం, డబ్బు వృధా కాకుండా ఉంటుంది ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, ఇతర రాజీకి వీలున్న కేసులు పరిష్కరించుకోవచ్చు.. ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గమే రాజ మార్గం. అని తెలియజేశారు శ్రీదేవి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here