Friday, October 9, 2026
Google search engine
Homeతెలంగాణజి.ఎస్.ఐ డివిజన్ జేఏసీ 23 కాలనీల తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

జి.ఎస్.ఐ డివిజన్ జేఏసీ 23 కాలనీల తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

రాక్ టౌన్‌ ఏరియా లో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని జోనల్ కమిషనర్‌కు వినతి

భారతశక్తి:

ఎల్‌బీ నగర్ జోనల్ ఆఫీస్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జి.ఎస్.ఐ డివిజన్ జేఏసీ 23 కాలనీల ప్రతినిధులు పాల్గొని, కాలనీలలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రజావాణి నిర్వహిస్తున్న సి.పి శ్రీనివాస్ గారిని కోరారు.
జి.ఎస్.ఐ డివిజన్ జేఏసీ 23 కాలనీలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రాక్ టౌన్ ప్రాంతంలో ప్రతిపాదించిన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పనును చేపట్టేలా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను కోరారు.
ఈ సందర్భంగా గతంలో సమర్పించిన లేఖలు, వినతిపత్రాలను అధికారులకు చూపించి, సమస్య తీవ్రతను మరోసారి వివరించారు. అనంతరం జి.ఎస్.ఐ డివిజన్ జేఏసీ 23 కాలనీల తరఫున మరో వినతిపత్రాన్ని (జోనల్ కమిషనర్‌) సి.పి శ్రీనివాస్ కు అందజేశారు.
రాక్ టౌన్ ప్రాంతంలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే జి.ఎస్.ఐ డివిజన్ జేఏసీ పరిధిలోని 23 కాలనీలకు తాగునీటి సరఫరా మెరుగుపడి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రతినిధులు తెలిపారు. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ఈ అంశంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ 23 కాలనీల సభ్యులు ఎర్ర వినోద్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి,మల్లేశం, సత్తి రెడ్డి ఉమేష్ గౌడ్, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,రాము,రామ్మోహన్,పున్న భాస్కర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments