Friday, July 17, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్జూలై 18న సరూర్‌నగర్‌లో నిర్వహించే బీఆర్ఎస్ "యువ సంగ్రామ సభ"ను విజయవంతం చేయాలి

జూలై 18న సరూర్‌నగర్‌లో నిర్వహించే బీఆర్ఎస్ “యువ సంగ్రామ సభ”ను విజయవంతం చేయాలి

ఎల్బీనగర్:

నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, జూలై 18న సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “యువ సంగ్రామ సభ” ఏర్పాట్లలో భాగంగా సభా వేదిక నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు, మాజీ చైర్మన్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా సభకు సంబంధించిన వేదిక నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించి సంబంధిత కమిటీలకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేసి, నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments