Saturday, October 24, 2026
Google search engine
Homeతెలంగాణజోయాలుక్కాస్ వనస్థలిపురం శాఖలో వజ్రాభరణాల ప్రదర్శన

జోయాలుక్కాస్ వనస్థలిపురం శాఖలో వజ్రాభరణాల ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా

వనస్థలిపురం లో ప్రారంభమైన ఈ జోయాలుకాస్
ప్రపంచానికి ఇష్టమైన ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ వనస్థలిపురం శాఖలో ఈ నెల 23వ తేదీ నుండి వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శనలో నైపుణ్యం, సొగసు, సరికొత్త ఆవిష్కరణలతో అపురూపమైన వజ్రాల విందును అందిస్తోంది.

పెళ్లిళ్లకు సంబంధించిన అద్భుతమైన నగల నుండి నిత్యం ధరించే ఆధునిక ఆభరణాల వరకు, సంప్రదాయం, ఆధునికత కలగలిసిన ఆభరణాలు ఇందులో లభిస్తున్నాయి. ప్రతి నమూనా ఒక కళాఖండంగా ఉంటుంది. ఈ ప్రదర్శన పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

జోయాలుక్కాస్ సంస్థ అధినేత డాక్టర్ జోయాలుక్కాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ తమ ప్రయాణంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, పండుగ సమయంలో జరిగే ఈ ప్రదర్శన వినియోగదారులకు అందం, ప్రత్యేకత కలిగిన నమూనాలను చూసే అవకాశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ప్రదర్శన సమయంలో లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. ఈ ప్రదర్శన నవంబర్ 08 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న గౌడ్, బి ఆర్ ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments