కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం, మూసాపేట్ లో శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శాంతిపూజా జరిపించిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, ఆలయ చైర్మన్ రాచమళ్ళ బిక్షపతి గౌడ్, బీబ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కర్కా పెంటయ్య, మూసాపేట్ డివిజన్ అధ్యక్షుడు తూము సంతోష్, అస్లాం, రాచమళ్ళ శేఖర్ గౌడ్, ఎల్లేష్ యాదవ్, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.


