ఎల్బీనగర్
సుమ వెంకటేశ్వర కాలనీ, ఇందు ఆరణ్య నివాసి సాయికుమార్ (29)ఇతను ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో గ్యాస్ బుక్ చేసేందుకు ఇందు ఆరణ్య నుంచి గౌరెల్లి వైపు వెళ్తుండగా, కుంట్లూరు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న ఎండి పోయిన చెట్టు అకస్మాత్తుగా అతనిపై కూలి పడింది. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఇంకొక వ్యక్తి గాయ పడినట్లు, ఈ ఘటనపై తదుపరి వివరాలు సేకరించాల్సి ఉందని నాగోల్ పోలీసులు తెలిపారు.


