Home ఇంటర్నేషనల్ పుతిన్ భారత పర్యటనలో కీలక దౌత్య చర్చలు – మోదీతో 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం

పుతిన్ భారత పర్యటనలో కీలక దౌత్య చర్చలు – మోదీతో 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం

0
పుతిన్ భారత పర్యటనలో కీలక దౌత్య చర్చలు – మోదీతో 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం
“ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ — 2025 ఇండియా-రష్యా Annual Summit నేపథ్యంలో ఢిల్లీలో శిఖరాగ్ర సమావేశ సందర్భంగా”

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన 23వ ఇండియా–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత మరియు గ్లోబల్ జియోపాలిటికల్ పరిస్థితులపై విస్తృత చర్చలు జరిగాయి.ఈ పర్యటన, ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యా–భారత సంబంధాల్లో మరింత సమీపతను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు

ఘన స్వాగతం – రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం

పుతిన్ ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఇరు దేశాల ప్రతినిధి బృందాలను పరస్పరం పరిచయం చేశారు.

ఆ తర్వాత పుతిన్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ స్మారక స్థలంలో నివాళులు అర్పించారు. సందర్శకుల పుస్తకంలో శాంతి–మైత్రీ సందేశాన్ని కూడా నమోదు చేశారు.

మోదీ–పుతిన్ చర్చలు:ప్రధానంగా ఏ విషయాలు ?

వాణిజ్యం

  • ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంపై చర్చ
  • చమురు, బొగ్గు, ఎరువు దిగుమతుల్లో దీర్ఘకాల ఒప్పందాలకు రూపురేఖలు

రక్షణ

  • సుఖోయ్-57 ఫైటర్ జెట్‌ల అప్గ్రేడ్ ప్యాకేజీ
  • S-400 తదుపరి విడత సరఫరాల పురోగతి
  • జాయింట్ డిఫెన్స్ ప్రొడక్షన్, మిలిటరీ టెక్నాలజీ షేరింగ్ పై చర్చలు

ఇంధన భద్రత

  • రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను రాయితీతో కొనుగోలు కొనసాగింపు
  • అణుశక్తి రంగంలో కొత్త ప్రాజెక్టులపై చర్చ
    (కూడాంకులం అణు ప్లాంట్-5 & 6 పనుల పురోగతి కూడా చర్చల్లో పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.)

గ్లోబల్ పరిస్థితులు

  • ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య పరిస్థితులపై సమగ్ర చర్చ
  • గ్లోబల్ సప్లై చైన్ స్థిరీకరణలో భారత–రష్యా పాత్ర

కొత్త ఒప్పందాలు త్వరలో

సదస్సు అనంతరం ఇరు దేశాలు వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్–టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక మార్పిడి వంటి విభాగాల్లో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముందని విదేశాంగ శాఖ వర్గాలు సూచిస్తున్నాయి.

మోదీ–పుతిన్ సంయుక్త మీడియా సమావేశం కూడా జరగనుంది, ఇందులో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

పర్యటన ప్రాముఖ్యత ఏమిటి?

  • ఇది పుతిన్‌కి నాలుగు సంవత్సరాల తర్వాత భారత పర్యటన
  • గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా భారత్–రష్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయనే సంకేతం
  • పశ్చిమ దేశాల ఒత్తిళ్ల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను నిలబెట్టుకుంటున్నదనేది ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here