Home నేషనల్ పూణేలో షాకింగ్ సంఘటన..

పూణేలో షాకింగ్ సంఘటన..

0
పూణేలో షాకింగ్ సంఘటన..
The lorry lost control and overturned.

అదుపుతప్పి బోల్తాపడిన లారీ..
ఇద్దరు ఐటీ ఉద్యోగుల దుర్మరణం..

మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడడంతో దాని కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడు రోడ్ల సెంట‌ర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగిన‌ట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కాంక్రీట్ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి ప‌క్క‌నే స్కూటీపై వెళ్తున్న వారిపై అమాంతంగా పడిపోయింది. దాంతో ఆ కాంక్రీట్ లారీ కింద పడి ఇద్ద‌రు ఐటీ ఉద్యోగినులు నుజ్జు నుజ్జయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here