Saturday, August 1, 2026
Google search engine
Homeతెలంగాణ*బాలాపూర్ టీయూడబ్ల్యూజే సంయుక్త కార్యదర్శిగా బొల్లంపల్లి రాంబాబు

*బాలాపూర్ టీయూడబ్ల్యూజే సంయుక్త కార్యదర్శిగా బొల్లంపల్లి రాంబాబు

*మహేశ్వరం:

బాలాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) బాలాపూర్ మండల నూతన అధ్యక్షుడిగా కే. మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జయంత్, సంయుక్త కార్యదర్శిగా బొల్లంపల్లి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం: రాంబాబు
ఈ సందర్భంగా నూతన సంయుక్త కార్యదర్శి బొల్లంపల్లి రాంబాబు మాట్లాడుతూ.. తనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీడియా మిత్రులకు, సహకరించిన తోటి జర్నలిస్టులకు, అలాగే రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం అందించే మార్గదర్శకాలను పాటిస్తూ, మండల కమిటీ సభ్యులందరితో కలిసి స్థానికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments