Monday, August 17, 2026
Google search engine
Homeతెలంగాణభారత ఇంధన భద్రతకు పెనుముప్పు: వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాల వెలికితీతకు తెలంగాణ చారిత్రక అడుగు!

భారత ఇంధన భద్రతకు పెనుముప్పు: వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాల వెలికితీతకు తెలంగాణ చారిత్రక అడుగు!

  • కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బ్యాటరీ ముప్పు
  • భూగర్భ జలాలను, నేలను విషపూరితం చేస్తున్న లక్షలాది టన్నుల లిథియం-అయాన్, లెడ్-యాసిడ్ వ్యర్థాలు.
  • ​చైనా గుప్పిటి నుంచి విముక్తి: కోబాల్ట్, నికెల్, లిథియం సరఫరా గొలుసు తెగిపోతే అంధకారంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉన్న సాంకేతిక రంగం.
  • ​ఐఐటీ హైదరాబాద్‌తో సరికొత్త యుద్ధ తంత్రం: టీజీపీసీబీ, సీపీసీబీ ఆధ్వర్యంలో ఆగస్టు 19న సనత్‌నగర్‌లోని పర్యావరణ భవన్‌లో అత్యున్నత స్థాయి జాతీయ వర్క్‌షాప్.
  • ​WCEF-2026 సన్నాహక భేరి: సెప్టెంబర్‌లో జరగనున్న 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ అంతర్జాతీయ ప్రయాణానికి తెలంగాణ దిశా నిర్దేశం.
  • ​వ్యర్థాలను సంపదగా మార్చే యజ్ఞం: సాలిడ్-లిక్విడ్ ఎక్స్‌ట్రాక్షన్ పద్ధతి ద్వారా నూటికి నూరు శాతం ఖనిజాలను పునరుద్ధరించే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలు.
  • కరిగిపోతున్న వనరుల కాలంలో కాలుష్య మండలి హెచ్చరిక

హైదరాబాద్:

వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాల వెలికితీతకు ఐఐటీతో కలిసి ప్రణాళిక
భారతదేశ భవిష్యత్ ఇంధన భద్రతను, పర్యావరణ సమతుల్యతను శాసించబోయే అత్యంత కీలకమైన అంశంపై తెలంగాణ గడ్డపై సమరశంఖం పూలయింది. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన నిల్వల పేరిట విచ్చలవిడిగా వాడుపారేస్తున్న బ్యాటరీల వ్యర్థాలు రేపటి ముప్పునకు తార్కాణమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తుసంఘిస్తున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అత్యంత సాహసోపేతమైన ముందడుగు వేసింది. దేశాన్ని కుదిపేస్తున్న ఈ ప్రమాదకర సంక్షోభానికి అడ్డుకట్ట వేస్తూ, వ్యర్థాల నుంచి వంద శాతం కీలక ఖనిజాలను పునరుద్ధరించే అసాధారణ ప్రణాళికకు తెరలేపింది.

భారత శక్తి ప్రత్యేక విశ్లేషణ: కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బ్యాటరీ ముప్పు
మారుతున్న కాలానికి అనుగుణంగా దేశం హరిత ఇంధన వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, దీని వెనుక దాగున్న ముసరుగు ముప్పును వ్యవస్థలు ఆలస్యంగా గుర్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది టన్నుల చొప్పున పేరుకుపోతున్న లిథియం-అయాన్, లెడ్-యాసిడ్ బ్యాటరీలు భూగర్భ జలాలను, నేలను విషపూరితం చేస్తున్నాయి. చైనా వంటి దేశాల గుప్పిట్లో ఉన్న కోబాల్ట్, నికెల్, లిథియం మరియు అరుదైన భూ మూలకాల (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) సరఫరా గొలుసు రేపు తెగిపోతే భారత సాంకేతిక రంగం అంధకారంలోకి కూరుకుపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే వ్యర్థాల నిర్వహణను ఒక ‘వ్యాపార అవకాశంగా’ కాకుండా, ‘జాతీయ రక్షణ బాధ్యతగా’ మలచాలని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.

*ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సరికొత్త యుద్ధ తంత్రం:
ఈ ముప్పును ముందే పసిగట్టిన టీజీపీసీబీ, ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) సమన్వయంతో మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సహకారంతో ఒకరోజు అత్యున్నత స్థాయి జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది.

  • తేది: 19 ఆగస్టు 2026
  • సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు (రిజిస్ట్రేషన్: ఉదయం 10:00 గంటలకు)
  • వేదిక: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, సనత్‌నగర్, పర్యావరణ భవన్, హైదరాబాద్.

*గ్లోబల్ వేదికకు నాంది: WCEF-2026 సన్నాహక భేరి:
రాబోయే సెప్టెంబర్ 15 నుండి 18 వరకు జరగనున్న 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ (WCEF-2026) సన్నాహక సదస్సులలో భాగంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ ప్రయాణంలో, దేశం తరఫున తెలంగాణ తీసుకుంటున్న ఈ చర్యలు యావత్ దేశానికీ దిశా నిర్దేశం చేయనున్నాయి.

*శాస్త్రీయ ప్రదర్శనలు – అత్యున్నత సాంకేతిక వేదిక:
కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆచరణీయమైన సాంకేతికతను ఆవిష్కరించేందుకు దేశంలోని అత్యున్నత పరిశోధనా సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి.

  • పాల్గొంటున్న సంస్థలు: సీయస్ఐఆర్-ఎన్ఎంఎల్ (చెన్నై), సీయస్ఐఆర్-సీఈసీఆర్ఐ, ఐఐటీ హైదరాబాద్, అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్, మరియు హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్.
  • ముఖ్యమైన సాంకేతిక విశ్లేషణలు:
  • సాలిడ్-లిక్విడ్ ఎక్స్‌ట్రాక్షన్ పద్ధతి ద్వారా కోబాల్ట్, నికెల్, లిథియంలను విడదీయడం.
  • అధునాతన లోహ-వెలికితీత (మెటల్-ఎక్స్‌ట్రాక్షన్) సాంకేతికతలు.
  • విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత (ఈపీఆర్) చట్టాల కఠిన అమలు.
  • పరిశ్రమలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి ఆచరణాత్మక సవాళ్లు.

*ఖనిజాల పునరుద్ధరణే ఏకైక మార్గం:
భారతదేశ వనరుల భద్రతను కాపాడుకోవాలంటే ‘సర్క్యులర్ ఎకానమీ’ విధానాన్ని అమలు చేయడమే ఏకైక మార్గమని ఈ సదస్సు తేల్చిచెప్పనుంది. వాడుపారేసిన ప్రతి బ్యాటరీ నుండి విలువైన ఖనిజాలను నూటికి నూరు శాతం వెలికితీసే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారానే పరాధీనత నుండి విముక్తి లభిస్తుంది. వ్యర్థాలను సంపదగా మార్చే ఈ చారిత్రక యజ్ఞంలో పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు మరియు నియంత్రణ సంస్థల భాగస్వామ్యం దేశ భవిష్యత్తును నిర్ణయించనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments