బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, రాష్ట్ర సహా ఇంచార్జి రేఖశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి
శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్, విడియా కాలనీ లోని బీజేపీ నాయకులు సమ్మెట ప్రసాద్ నివాసంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన ప్రత్యేక సమావేశం,మయూరి నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ ఇంపీరియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో 139వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంతో పాటు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర ఇంచార్జ్ రేఖా శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి & శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరై మన్ కీ బాత్ వీక్షించి పట్టభద్రుల కు దిశానిర్దేశం చేశారు,రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్కు చేరుకోవడం హర్షణీయం. విద్యావంతులైన పట్టభద్రులు తమ ప్రజాస్వామ్య హక్కును గుర్తించి వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని, దేశ భవిష్యత్తుకు ఇది కీలకమని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సహాయ ఇన్ఛార్ రేఖా శర్మ మాట్లాడుతూ
ఓటర్ల నమోదులో యువత, విద్యావంతులు చూపుతున్న ఆసక్తి అభినందనీయం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి చేయాలని కోరారు.
గౌతం రావు మాట్లాడుతూ
రాబోయే పట్టభద్రుల మరియు జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గం ఇంచార్జ్
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలని పిలునిచ్చారు, పార్టీ అభివృద్ధికి ,బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రతి నాయకుడు, నాయకురాళ్ళు, కార్యకర్తల శ్రమను పార్టీ గుర్తిస్తుందని, ప్రతి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో స్థానిక సమస్యల పరిష్కారానికి ,ప్రజలతో మమేకమై పని చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి , రవీందర్ రావు ,కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ,నాగులు గౌడ్ , సమ్మెట ప్రసాద్ ,సీతారామరాజు,గణేష్ ముదిరాజ్ , లక్ష్మణ్, కృష్ణ రాష్ట్ర , గోపాల్ రావు, ఆంజనేయులు సాగర్, మహేష్ యాదవ్, పద్మ, కాంచన కృష్ణ, శ్రీనివాస్, రాజేష్ గౌడ్, మరియు జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులు, కాలనీవాసులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



