Friday, October 16, 2026
Google search engine
Homeతెలంగాణరైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలి: గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలి: గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా

  • దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక
  • విత్తన రంగంలో నూజివీడు సీడ్స్‌ వ్యవస్థాపకుడు మండవ వెంకట్రామయ్య సేవలు చిరస్మరణీయం
  • నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మండవ వెంకట్రామయ్య స్మారక కార్యక్రమంలో గవర్నర్‌

హైదరాబాద్

రైతుల అవసరాలను గుర్తించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి దూరదృష్టితో కృషి చేసిన మహనీయుడు నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు దివంగత మండవ వెంకట్రామయ్య అని తెలంగాణ గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా కొనియాడారు. రైతుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే నిజమైన విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో గురువారం నిర్వహించిన భారతదేశంలో ప్రముఖ విత్తన తయారీ కంపెనీ నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు
మండవ వెంకట్రామయ్య స్మారక కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . మండవ వెంకట్రామయ్య స్మారకంగా మొక్క నాటారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్‌ నివాళులర్పించారు.ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. నాణ్యత, విశ్వసనీయత, నూతన ఆవిష్కరణలను ప్రాతిపదికగా చేసుకుని మండవ వెంకట్రామయ్య విత్తన రంగంలో విశేష కృషి చేశారని అన్నారు. ఆయన దూరదృష్టి వ్యవసాయ రంగానికి నూతన దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు. వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేయడం, ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలోనే నిజమైన సార్థకత ఉందని ఆయన జీవితం చాటిచెబుతోందన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని గవర్నర్‌ పేర్కొన్నారు. రైతుల శ్రమ, అంకితభావం, పట్టుదలతోనే దేశంలో ఆహార భద్రత సాధ్యమవుతోందని అన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతోపాటు రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ఒక సంస్థ విజయవంతం కావడంలో దాని ఉద్దేశ్యం , ఉద్యోగుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత కీలకమని గవర్నర్‌ అన్నారు. మండవ వెంకట్రామయ్య నెలకొల్పిన ఆదర్శాలను కొనసాగిస్తూ నూజివీడు సీడ్స్‌ సంస్థ వ్యవసాయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, రైతుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.

యువత మండవ వెంకట్రామయ్య జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. జ్ఞానం, కఠోర శ్రమ, నిజాయితీ, దృఢ సంకల్పంతో లక్ష్యాలను సాధిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి రైతుకు సమాన అవకాశాలు, ఆధునిక వ్యవసాయ సదుపాయాలు అందుబాటులో ఉండటంతోపాటు వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ మండవ వెంకటేశ్వరరావు, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాంశు పాఠక్‌, నుజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఎం. ప్రభాకరరావు, మండవ కుటుంబ సభ్యులు, సంస్థ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments