ఎల్బీనగర్:
సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని ఇండోర్ స్టేడియం వద్ద శుక్రవారం సి & డి వేస్ట్ (కన్స్ట్రక్షన్ & డెమోలీషన్ వేస్ట్) సేకరణకు సంబంధించిన ప్రత్యేక వాహనాలను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఇకపై ఇళ్ల నిర్మాణాలు, మరమ్మతుల సమయంలో వెలువడే ఇటుకలు, సిమెంట్ కాంక్రీట్, మట్టి తదితర నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా, సంబంధిత వాహనాలను బుక్ చేసుకోవడం ద్వారా వాటిని సేకరించి ఫతుల్లా గూడ ప్లాంట్‌కు తరలించి శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది.అదేవిధంగా, సర్కిల్ పరిధిలో ఇప్పటికే పేరుకుపోయిన డెబ్రిస్‌ను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం జరుగుతుంది.ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ, ఎవరూ కూడా రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు లేదా డెబ్రిస్‌ను వేయకుండా, అందుబాటులో ఉన్న సీ&డీ వేస్ట్ వాహనాలను వినియోగించుకోవాలని కోరారు.కావున ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన నగర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ పంకజ, అడిషనల్ కమిషనర్ (హెల్త్ అండ్ శానిటేషన్) సి.ఎన్ రఘు ప్రసాద్, ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి, సరూర్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, ఈఈ కార్తీక్, జలమండలి డీజీఎం చంద్రు నాయక్, డీఈ విజయ్ కుమార్, డీఈ చందన, యూబీడీ మేనేజర్ లోకేష్, ఏఎంఓహెచ్ రంజిత్, వెటర్నరీ డాక్టర్ భీక్యా నాయక్, ఏఈఈ హర్షిత, ఎంఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.



