Friday, October 23, 2026
Google search engine
Homeతెలంగాణసాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలాయ్ బలాయ్ వేడుక: మంత్రి శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ హాజరు

సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలాయ్ బలాయ్ వేడుక: మంత్రి శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ హాజరు

హైద్రాబాద్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కేంద్ర మాజీ మంత్రివర్యులు మరియు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన ‘అలాయ్ బలాయ్’ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఏఐపీసీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సన్మానించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రపంచ వేదిక:
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, అలాయ్ బలయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను బండారు దత్తాత్రేయ ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లారని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వేడుక మన విశిష్ట సంస్కృతిని సముచితంగా చాటుతోందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు.
దత్తాత్రేయ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అలాయ్ బలయ్ గొప్ప వారసత్వాన్ని వారి కుమార్తె విజయలక్ష్మి భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

వేడుకలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను మంత్రి శ్రీధర్ బాబు మరియు మధుయాష్కి గౌడ్ ఘనంగా అభినందించారు. వారికి స్వయంగా బహుమతులను ప్రధానం చేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments