హైదరాబాద్:
ఆదివాసీల హక్కుల సాధన కోసం ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాడిన కొమురం భీమ్, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిలబడిన ప్రజా వీరుడు పండుగ సాయన్నల జయంతిని హైడ్రా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇరువురి సేవలను స్మరించుకుంటూ.. వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఘనంగా నివాళులర్పించారు. అన్యాయంపై పోరాటం, సమానత్వం కోసం తపన, పేదలు మరియు అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కమిషనర్ అన్నారు. వారి పోరాట స్ఫూర్తి, ధైర్యం, ప్రజల పట్ల అంకితభావం భావితరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.


