ఎల్బీనగర్
హైదరాబాద్ నగరంలోని ఆగాఖాన్ అకాడమీలో ‘బోబా బాష్ హైదరాబాద్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.13 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువత కోసం ఉచితంగా నిర్వహించిన ఈ టెక్నాలజీ వర్క్‌షాప్‌లో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌టిఎంఎల్, సీఎస్ఎస్ వంటి సాంకేతికతలను నేర్చుకుని, తమ సొంత వెబ్సైట్లను స్వయంగా రూపొందించడం ద్వారా విద్యార్థులు తమలోని సృజనాత్మకతను నిరూపించుకున్నారు. యువత సాంకేతిక రంగంలో స్వయంగా ప్రాజెక్టులు చేపట్టేలా ప్రోత్సహించే అంతర్జాతీయ కమ్యూనిటీ ‘హాక్ క్లబ్’ (Hack Club) సహకారంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లో ఉన్న ఆర్కిటెక్చర్ సంస్థ వారి అయిరా ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నిమ్మ ఆకాష్ రెడ్డి ప్రత్యేక మద్దతు అందించారు. యువతను ఒకే వేదిక పైకి చేర్చి, వారు నూతన సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి, వారే సొంత ప్రాజెక్టులు రూపొందించడానికి వారి సహకారం ఎంతగానో తోడ్పడిందని నిర్వాహకులు పేర్కొంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


