ఎల్బీనగర్:
ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో మాజీ బాల్కొండ శాసనసభ్యులు, విప్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఈరవత్రి అనిల్ కుమార్ నేతృత్వంలో ట్రస్టు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నాయకులు పెద్దలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలవడం జరిగినది. తెలంగాణ జాతి పిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతి త్వరలో, కొత్తపేట కూడలి లో ప్రతిష్టించ బడనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 33 అడుగుల భారీ కాంస్య విగ్రహం సంబంధించిన కరపత్రాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ట్రస్ట్ సభ్యులు సిరిసిల్ల చేనేత కళాకారుడు హరి చేనేత మగ్గంపై తయారు చేసిన ముఖ్యమంత్రి దంపతుల పట్టు వస్త్రపు ఫోటో ప్రేమ్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది.అలాగే,విగ్రహ ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగా చేయుటకు అంగీకరించారు. విగ్రహ ప్రారంభోత్సవం నకు కొన్ని తేదీలను సూచించగా, ఆయన ఆమోదం కూడా తెలిపారు. పద్మశాలీయులు సమిష్టి గా ఉంటే ఎన్నో సత్ఫలితాలు సాధించవచ్చునని ఆయన తెలిపారు.ట్రస్ట్ చైర్మన్ పున్న గణేష్ నేత మాట్లాడుతూ, అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ కొండాలక్ష్మణ్ ను బాపూజీ అని సంబోదించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత అని సంబోధించడం పట్ల మరియు ఎల్బీనగర్లో టిమ్స్ హాస్పిటల్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ప్రకటించడం పట్ల పద్మశాలీలంతా,సంతోషం వ్యక్తపరిస్తున్నారని,తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నారని,అందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విగ్రహావిష్కరణ సమయం లో వేలాది మందితో కొత్తపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు కంద గట్ల స్వామి ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్థపు మురళి తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ కుడా చైర్మన్ గుండు సుధారాణి ప్రభాకర్, క్రియేటివ్ డైరెక్టర్ కొండ రాజు టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి పద్మశ్రీ గజం అంజయ్య, చాగండ్ల నరేంద్రనాథ్, పుట్ట పాండురంగయ్య, అఖిల భారత మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతుల తెలంగాణ ప్రాంత మహిళ అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి అధ్యక్షురాలు పోరండ్ల శారద, కంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల గణేష్ నేత ట్రస్టు సెక్రెటరీ గడ్డం లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు కౌకుంట్ల రవితేజ, గుర్రం శ్రావణ్ ,జెల్ల జగన్నాథం, పడాల రవీందర్, చెరుపల్లి ప్రభాకర్, కర్నాటి మనోహర్ ,కర్నాటి ధనుంజయ, గుజ్జ సత్యం, బొద్ధుల లక్ష్మణ్, రాపోలు సుధాకర్, రాంప్రకాష్, నారని రవీందర్ అవ్వారి భాస్కర్, తడక యాదగిరి, గజం నరేంద్ర, చిక్క చంద్రమోహన్, నామని సత్యనారాయణ, రాపోలు శ్రీహరి, దోర్నాల చంద్రమౌళి, చిటిపోలు శ్రీనివాస, కస్తూరి శ్రీనివాస్, మసన రవి కుమార్, గజం గురునాథం మహిళా అధ్యక్షురాలు రమాదేవి, పేరాల సుజాత, చెరుపల్లి వర్ణలీల, ఇడం సంతోషి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నాయకులు అఖిలభారత పద్మశాలి నాయకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు


