Wednesday, September 16, 2026
Google search engine
Homeతెలంగాణఇరుముడి సినిమాపై డీజీపీకి ఫిర్యాదు..

ఇరుముడి సినిమాపై డీజీపీకి ఫిర్యాదు..

  • మైనర్ బాలికపై అసభ్య పదజాల ప్రయోగం!
  • జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో డిజిపికి నేరుగా ఫిర్యాదు

హైదరాబాద్:

చిత్ర పరిశ్రమలో రోజురోజుకూ దిగజారుతున్న నైతిక విలువలకు, బాధ్యతారహిత ప్రవర్తనకు అద్దం పట్టేలా తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్ల పేరుతో విజ్ఞత మరచి, ఒక మైనర్ బాలికను ఉద్దేశించి అత్యంత హేయమైన, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చలనచిత్రాల ప్రచారం ముసుగులో జరుగుతున్న ఈ దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘జై లోక్ సత్తా’ (సోషల్ జస్టిస్ ఫోరం) సంస్థ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

*ప్రచార వేదికపైనే పరాభవం
నటుడు రవితేజ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ప్రచార కార్యక్రమంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన వేదికపై, ఒక మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని హీరో రవితేజ “ముదురు ముండ” అంటూ అత్యంత నీచమైన, అసభ్యకరమైన పదజాలాన్ని బహిరంగంగా ఉపయోగించినట్లు స్పష్టమైన దృశ్య ఆధారాలు, వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. కళాకారులుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే నిబంధనలను కాలరాస్తూ, చిన్నారుల పట్ల ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

*బాలల రక్షణ చట్టాల ఉల్లంఘనే!
ఏదైనా వినోద రంగం లేదా ప్రచార కార్యక్రమం ముసుగులో చిన్నారులను అవమానించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అనేది క్షమించరాని నేరం. బాలల మానసిక భద్రతను, ప్రతిష్టను కాలరాసేలా భాషను సాధారణీకరించే చర్యలను ఏ నాగరిక సమాజమూ సహించకూడదు. ఈ ఘటనలో భారతీయన్యాయ సంహిత (బీఎన్ఎస్), బాలల హక్కుల పరిరక్షణ చట్టం (జువెనైల్ జస్టిస్ యాక్ట్) తదితర నిబంధనల కింద స్పష్టమైన చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినట్లు స్పష్టమవుతోంది.

*సమగ్ర విచారణకు డిమాండ్
సంబంధిత సినిమా ప్రచారానికి సంబంధించిన పూర్తి వీడియోలు, దృశ్యాలు, ఇతర సమగ్ర ఆధారాలను సేకరించి నిపుణుల పరిశీలన జరపాలని ఫిర్యాదులో కోరారు. కేవలం ప్రధాన నటుడిపైనే కాకుండా, ఈ దారుణానికి సహకరించిన సినిమా నిర్మాతలు, దర్శకులు, ప్రచార నిర్వాహకులు మరియు బాధ్యులైన ప్రతీ ఒక్కరి పాత్రపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చిన్నారుల హక్కులను కాలరాసే శక్తులపై చట్టం తన పని తాను చేసుకుపోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్ బాబు చొల్లెట్టి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments