Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాం : మోతే శోభన్ రెడ్డి.

ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాం : మోతే శోభన్ రెడ్డి.

ఎల్బీనగర్:

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో న్యాయం చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా ” అలై బలయి” ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి మోతే శోభన్ రెడ్డి , బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, ఏపూరి సోమన్నలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు గుర్తింపు కమిటీని వేయడం జరిగిందని అన్నారు. గుర్తింపు కమిటీ ఆధారంగానే అందరికీ న్యాయం చేస్తామని, పది ఉమ్మడి జిల్లాల నుండి 15 రోజులుగా ప్రతిరోజు వెయ్యి మందివి అభిప్రాయ సేకరణ తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉద్యమకారులు అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఇస్తామని తెలిపారు.ఇంత పెద్ద ఎత్తున అలై బలయి కార్యక్రమాన్ని నిర్వహించిన కాచం సత్యనారాయణకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఉద్యమకారులు అడుగుతున్నారని అన్నారు.ఉద్యమకారుల కోసం ఫ్యూచర్ సిటీలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని, ప్రతి ఒక్కరికి 250 గజాల ఇంటి స్థలము, గుర్తింపు కార్డు, ఉచిత బస్సు పాసు, హెల్త్ కార్డు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వమైనా ఉద్యమకారుల ఆకాంక్షల నెరవేర్చాలని అన్నారు. ఉద్యమం సమయంలో ఎల్బీనగర్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో పని చేసి కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉద్యమకారులు ఏ పార్టీ నుండి పోటీ చేసినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి,పల్లె వినయ్ కుమార్ గౌడ్, ఎల్బీనగర్ కన్వీనర్ బీరెల్లి వెంకట్ రెడ్డి, ఉప్పల శ్రవణ్, కొత్త రవి, ఇరుగు శ్రీధర్, పిడికిలి రాజు,గుజ్జ సత్యం, బొమ్మ రఘురాం నేత పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments