Tuesday, October 27, 2026
Google search engine
Homeతెలంగాణకర్మన్ ఘట్ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మధుయాష్కి.

కర్మన్ ఘట్ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మధుయాష్కి.

హైదరాబాద్

కర్మన్ ఘట్ ప్రాంతంలో శ్రీ బీరప్ప స్వామి, కామరాతి దేవీల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మధుయాష్కికి నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మధుయాష్కి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు మధుయాష్కిని ఆత్మీయంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

అందరికీ శుభాలు కలగాలి: మధుయాష్కి:
ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. బీరప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ తమ కుటుంబాలతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచే ఇటువంటి ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని, శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments