ఎల్బీనగర్
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పి&టీ కాలనీకి చెందిన ఆత్మీయ సోదరుడు వివేక్ (టోనీ) ఇటీవల విడుదలైన ‘కల్ట్’ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వివేక్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వివేక్ సినిమా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తన ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన చిత్రాల్లో నటించి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.మన ప్రాంతానికి చెందిన యువకులు వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఎంతో ఆనందకరమని, వివేక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.


