Homeతెలంగాణకేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పాదయాత్ర కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పాదయాత్ర కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి…
- శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులుప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం…
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ యాదవ్
- శేరిలింగంపల్లి :
- తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలపై చేస్తున్న ప్రచారాన్ని ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమై మొజంజాహి మార్కెట్ వరకు కొనసాగిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పాదయాత్రలో భారీసంఖ్యంలో విచ్చేసిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్నvబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల గౌరవం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా రాజకీయ ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్య చర్చలకు సంబంధించిన అంశమని, ప్రతి ఒక్కరూ వాస్తవాలను పరిశీలించి ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.