నైపుణ్య శిక్షణ కోర్సులు యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.
శేరిలింగంపల్లి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసీ) సహకారంతో చందానగర్ లైట్‌హౌస్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నాలుగో వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, లైట్‌హౌస్ జాతీయ విస్తరణ విభాగం అధిపతి అతుల్, తెలంగాణ విస్తరణ విభాగం అధిపతి ఆకుల శ్రీనివాస్, చందానగర్ లైట్‌హౌస్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ యువతతో మాట్లాడుతూ, లైట్‌హౌస్ అందిస్తున్న నైపుణ్య శిక్షణా కోర్సులు యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శిక్షణతో పాటు ఉద్యోగ అనుసంధానం ద్వారా ఇప్పటివరకు 1,500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
నాలుగు సంవత్సరాలుగా యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న లైట్‌హౌస్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందనాలు తెలిపారు.


