Friday, November 20, 2026
Google search engine
Homeతెలంగాణజలమండలి అధికారుల నిర్లక్ష్యం...వృధాగా రోడ్ల మీద పారుతున్న మంచి నీళ్లు..

జలమండలి అధికారుల నిర్లక్ష్యం…వృధాగా రోడ్ల మీద పారుతున్న మంచి నీళ్లు..

ఎల్బీనగర్

పూర్తి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఎల్ నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిసినా కూడా అజాగ్రత్తగా మున్సురాబాద్ జలమండలి అధికారులు ప్రవర్తిస్తున్నారు. నిన్న రాత్రి సమయం 10:30 గంటలకు త్రాగే నీరు రోడ్లపై పారుతుంటే పట్టించుకోని జలమండలి అధికారులు. ఇంత నిర్లక్ష్య వైఖరితో ముందుకు పోతున్న జలమండలి అధికారులపైన స్థానిక ప్రజలు కోపోద్రిక్తులై ఉన్నారు. ఇలా ప్రతీ సారి నీళ్లు విప్పినప్పుడు మంచి నీళ్లు రోడ్ల పాలు అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. రోడ్ల మీద నీళ్లు పోతుంటే మాకే బాధనిపిస్తుందని వాపోతున్నారు. ఇంటిముందు ర్యాంపులు కడుగుతుంటే, కార్లు కడుగుతుంటే, ఇంటికి మోటర్లు పెడుతున్నారని ఫైన్లేసే జలమండలి అధికారులు ఇలా రోడ్ల పైన వృధాగా మంచి నీళ్లు పోతుంటే వాళ్లకి ఎంత ఫైన్ వేయాలో అని ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ పనిచేసే జలమండలి అధికారుల పైన చర్యలు తీసుకొని ఇలా మంచినీళ్ళని వృధాగా పోనీయకుండా తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని వారి పైన చట్టరీత్యా జలమండలి బోర్డు నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments