Thursday, October 29, 2026
Google search engine
Homeతెలంగాణజూనియర్ కళాశాలలో మెరిసిన ఆణిముత్యాలు

జూనియర్ కళాశాలలో మెరిసిన ఆణిముత్యాలు

ఎల్బీనగర్

సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ క్రీడలలో విశేష ప్రతిభను చూపించి ఫుట్ బాల్ అండర్ 17 విభాగంలో కే.లలిత్ తేజ్ ఎంపిసీ-సెకండ్ ఇయర్, ఎస్.ఆకాష్ సీఈసి సెకండ్ ఇయర్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలువగా, అండర్ 19 పుట్ బాల్ బాలుర విభాగంలో పి.శరత్ కుమార్ సీఈసి సెకండ్ ఇయర్, డి. గాంధి హెచ్ఇసి సెకండ్ ఇయర్, జి.ధోని హెచ్ఇసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు.అండర్ 19 బాలికల విభాగంలో బి. మధు ప్రియ బి. హరిణి సిఈసి సెకండ్ ఇయర్, తృతీయ స్థానంలో నిలిచారు. అలాగే రగ్బీ ఆటలో అండర్ 19 బాలికల విభాగంలో బి.హరిణి, బి. మధు ప్రియ మొదటి స్థానంలో నిలవగా,అండర్ 19 బాలుర విభాగంలో డి. గాంధీ హెచ్ఈసి ద్వితీయ సంవత్సరం, ఆర్.ఇశాంత్ హెచ్ఇసి ద్వితీయ సంవత్సరం, ఇ. పరమ సింహతేజ హెచ్ఇసి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.వీరిలో ఈ.పరమ సింహతేజ, ఆర్. ఇషాంత్, లలిత్ తేజ్ లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ అధ్యాపక, అధ్యాపకేతర బృందం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. అలాగే గెలుపోటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలోని అనేక సమస్యలను అధిగమించగలరని తెలిపారు. మిగతా విద్యార్థులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి ప్రావీణ్యం ఉన్న రంగాల్లో వారు రాణించాలని కోరారు.అలాగే జాతీయ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు కూడా విద్యార్థులను గొప్పగా ప్రశంసించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments