ఎల్బీనగర్
హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మిస్తున్న మూత్రశాలలను స్థానిక బస్తీవాసులతో కలిసి పరిశీలించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి.ఈ సందర్భంగా స్థానిక బస్తీవాసులు మాట్లాడుతూ, పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని మూత్రశాలలు నిర్మించడం వల్ల చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించి స్థానికులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని కావున వాటి నిర్మాణ స్థలాన్ని మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించిన సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఇంత పెద్ద పాఠశాల నందు మూత్రశాలలు కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. మూత్రశాలల నిర్మాణాన్ని పాఠశాల ప్రహరీ గోడ నుంచి ఐదు అడుగుల లోపలికి జరిపి చేపట్టాలని దుర్వాసన బయటకు వ్యాపించకుండా తగిన ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే మూత్రశాలల నిర్వహణ కోసం నెల నెలా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న డైనింగ్ హాల్‌ను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్వహణ లేకపోవడంతో డైనింగ్ హాల్ చెత్తాచెదారంతో నిండిపోయి నిరుపయోగంగా మారడాన్ని గమనించారు. వెంటనే డైనింగ్ హాల్‌లో ఫ్లోరింగ్ పనులను దాతల సహాయంచే మరమ్మతులు చేయించి అవసరమైన బండలు వేయించి ప్రస్తుతం ఉన్న వంటశాలను డైనింగ్ హాల్‌లోకి మార్చి వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక బస్తీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు చెన్నగోని శ్రీధర్ గౌడ్,సీనియర్ భారాస నాయకులు భాస్కర్ సాగర్, దీపావళి శ్రవణ్,నక్క దర్శన్, రాకేష్, సందీప్, మధు,రమేష్ ముదిరాజ్, గోపి, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


