- చిన్న కోతలతోనే వెన్నెముక శస్త్రచికిత్సలు.. వేగంగా కోలుకునే అవకాశం
- మారుతున్న జీవనశైలి, గంటల తరబడి కూర్చోవడంతో పెరుగుతున్న వెన్ను సమస్యలు
- ఎండోస్కోప్, మైక్రోస్కోప్ సాయంతో కచ్చితమైన చికిత్సలు
డా. కె. కృష్ణ చైతన్య
కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, మినిమల్లీ ఇన్వేసివ్ & రోబోటిక్ సర్జన్
కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్.
శేరిలింగంపల్లి
ఇంటి నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే పిల్లర్ ఎంత ముఖ్యమో. అలాగే మనిషి మనుగడ ప్రధానమైనది వెన్నుముక. అయితే ఇటీవల కాలంలో మారుతున్న జీవినశైలిలో ప్రతీ ఒక్కరూ బిజి బిజిగా ఉంటున్నారు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడడమే కాకుండా. లైఫ్ స్టైల్ డీసీజ్ కూడా గురువుతున్నారని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ చైతన్య అన్నారు. ఇ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మారుతున్నా జీవనశైలిలో ప్రతి ఒక్క వ్యక్తి బిజీ బిజీగా ఉన్నారు. అందువల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వెన్నుముక సమస్యలతో బాధపడుతున్న ఎక్కువ మందిని నా ఓపీలో చూస్తున్నా. ఇక్కడ విస్మయం కలిగించే విషయమేమిటంటే వారాంత యుక్త వయసులోని వారే. అందరూ దాదాపు 40 సంవత్సరాలోపు ఉన్నవారే. ఎందుకీ సమస్య వస్తుదంటే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, సరైన శరీర భంగిమ పాటించకపోవడం వంటి కారణాలతో వెన్నునొప్పి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఎక్కువసేపు వాహనాలు నడిపేవారు, ఒకేచోట కూర్చొని పనిచేసేవారు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట్లో సాధారణ నొప్పిగానే కనిపించినా, కొందరిలో డిస్క్ జారడం, నరాలపై ఒత్తిడి, వెన్నెముకలో అరుగుదల వంటి సమస్యలకు దారితీయవచ్చు. అయితే వెన్నునొప్పి వచ్చిందంటే శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందేనని భయపడాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్య విధానాలతో అనేక సమస్యలకు మందులు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పుల ద్వారా ఉపశమనం పొందవచ్చు. అవసరమైన సందర్భాల్లో చిన్న కోతలతో చేసే అధునాతన శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న నిర్వహించే ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా వెన్నెముక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. శరీరానికి ఆధారంగా నిలిచే వెన్నెముక, మెదడు నుంచి శరీరంలోని వివిధ భాగాలకు సంకేతాలను చేరవేసే నరాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించిన సమస్యలను తొలిదశలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఇబ్బందులను నివారించవచ్చు.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు చేసే చాలామంది రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడుపుతున్నారు. మధ్యలో లేవకుండా గంటల తరబడి కూర్చోవడం, ముందుకు వంగి పనిచేయడం, సరైన ఎత్తులో కుర్చీ, కంప్యూటర్ లేకపోవడం వల్ల మెడ, భుజాలు, నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా కండరాలు బిగుసుకుపోవడం, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు కూడా వెన్నెముకపై అదనపు భారాన్ని పెంచుతాయి.
అందువల్ల పనిచేసే సమయంలో శరీరాన్ని నిటారుగా ఉంచడం, కాళ్లకు సరైన ఆధారం ఉండేలా కూర్చోవడం, కంప్యూటర్ తెరను కళ్లకు అనువైన ఎత్తులో అమర్చుకోవడం అవసరం. ప్రతి 30–60 నిమిషాలకు కొద్దిసేపు లేచి నడవడం, తగిన విరామాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.


