పోలియో రహిత భారతదేశమే మన లక్ష్యం… పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి :
నిండు జీవితానికి రేండు చుక్కలు అని పి ఏ సి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. ఆదివారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్ లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమనికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య సిబ్బంది తో కలిసి 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు చాలు అని. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పోలియో రహిత భారతదేశమే మన అందరి లక్ష్యమని, దీనిని సాధించాలంటే ప్రతి బిడ్డకూ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలన పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ పిల్లల ఆరోగ్యం కోసం దగ్గరలోని పోలియో కేంద్రానికి వెళ్లి చుక్కల మందు వేయించాలని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని,ఇది పూర్తిగా ఉచితం, సురక్షితమని సూచించారు.దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టడంలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ,సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. పల్స్ పోలియో చుక్కలు అనేవి భారతదేశంలో పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక భారీ రోగనిరోధక కార్యక్రమం అని, అప్పుడే పుట్టిన శిశువుల నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.ఈ చుక్కలు అత్యంత సురక్షితమైనవి మరియు ఉచితంగా వేయబడతాయి. దీనివల్ల పిల్లలకు జీవితకాలం పోలియో పక్షవాతం రాకుండా రక్షణ లభిస్తుంది.అని పల్స్ పోలియో రోజున రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బస్టాండ్ లు మరియు ఇతర ప్రత్యేక కేంద్రాలలో చుక్కల మందు వేస్తారు తెలియచేశారు. బూత్‌లకు రాని పిల్లల కోసం, ఆరోగ్య కార్యకర్తలు తరువాతి 2 నుండి 3 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారు అని,పూర్తి స్థాయిలో పోలియో చుక్కలు వేసి పోలియో రహిత దేశంగా , పోలియో రహిత రాష్ట్రంగా, పోలియో రహిత శేరిలింగంపల్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, స్వచ్ఛందంగా ప్రతిఒక్కరు సామాజిక బాధ్యత తో పల్స్ పోలియో చుక్కలు వేయించేల చూడాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, డాక్టర్ దివ్య, వైద్య సిబ్బంది, నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మారెడ్డి, మిరియాల ప్రీతమ్, సాదిక్ కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.



