*ఢిల్లీలో శాంతియుత నిరసనలపై అణచివేత చర్యలను ఖండించిన ఎల్బీనగర్ యువజన కాంగ్రెస్ శ్రేణులు
*హైదరాబాద్:
దేశ భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, ఎల్బీనగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కే. శివకుమార్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ పై గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అమానుషంగా లాఠీచార్జి చేయించడం, దౌర్జన్యాలకు పాల్పడడం అత్యంత గర్హనీయమని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, నియంతలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరును నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన తూకం పడక తప్పదని హెచ్చరించారు.
*కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం రెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సాయిరాం సామలేటి, ఇర్ఫాన్, సంజు గౌడ్, ప్రధాన కార్యదర్శులు రూత్విక్ రెడ్డి, జావేద్, సోషల్ మీడియా ఇంచార్జ్ తిరుపతి, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు నేలపాటి రాజేష్, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు కుశాల్, మరియు యువజన కాంగ్రెస్ నాయకులు ఆదిత్య, గణేష్, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.


