బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
ఎల్బీనగర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన 8500 కోట్ల రూపాయాల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో దిల్సుఖ్నగర్లో విద్యార్థుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో చాలగటం ఆడుతున్న రేవంత్ రెడ్డి ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, స్కాలర్ షిప్ లను ఎత్తి వేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
స్కాలర్షిప్ రాదేమోనని భయంతో ఈ సంవత్సరం 30 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరుకాలేదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్, సైపాబాద్ లాంటి ప్రభుత్వ కాలేజీల్లో కూడా స్కాలర్ షిప్ లు రాకపోవడం వల్ల యాజమాన్యాలు విద్యార్థుల ముక్కు పిండి పీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన చేశారు.ప్రభుత్వం కళాశాలలకు ఫీజులు చెల్లించకపోవడంతో, ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి. దీనివల్ల 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేవారు, ఉద్యోగాలకు ఎంపికైన పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్లను, హాస్టల్ మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి.స్కాలర్షిప్ విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేయకపోతే, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


