- ఏకపక్ష నిర్ణయాలతో రాజ్యాంగం ఖూనీ: రాహుల్ గాంధీ నిప్పులు
- సీఈసీ అరాచక పాలనపై సుప్రీంకోర్టులో ఉరుములాంటి పిల్..
- పదవి నుంచి గెంటెయాలని విపక్షాల అల్టిమేటం
- పదమూడు కోట్ల ఓట్ల కొల్లగొట్టుడు: ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడుస్తున్న ఎన్నికల అగ్రపీఠం.
ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఓటు హక్కును తుంగలో తొక్కుతూ, ఎన్నికల సంఘం ఒక ‘ఓట్ల చోరీ కేంద్రం’లా మారుతోంది! తోటి కమిషనర్లను సైతం లెక్కచేయకుండా, కోట్లాది మంది ఓటర్ల పేర్లను గల్లంతు చేస్తున్న సీఈసీ అరాచకం దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ పీఠంపై కూర్చున్న ఈ నిరంకుశుడిని తక్షణమే బర్తరఫ్ చేయాలని విపక్షాలు అల్టిమేటం జారీ చేశాయి. లేదంటే, అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా సాగే ప్రజా ఆగ్రహ జ్వాలల్లో ఈ కుట్రదారుల పీఠాలు బస్మైపోవడం ఖాయం!
ఢిల్లీ:
దేశ అత్యున్నత ప్రజాస్వామ్య దేవాలయమైన ఎన్నికల సంఘం ముమ్మాటికీ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) అనుసరిస్తున్న నిరంకుశ, ఏకపక్ష విధానాలపై యావత్ దేశం భగ్గుమంటున్నది. తోటి ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఈసీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉధృతమైంది. ఈ ద్రోహపూరిత చర్యలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని దేశంలోని ప్రముఖ అగ్రనేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
*సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిని సవాల్ చేస్తూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి సుప్రీంకోర్టులో సంచలన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను సంప్రదించకుండా సీఈసీ తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధమని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో సమగ్ర విచారణ జరిపించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.
*రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు: ఓట్ల చోరీపై నిలదీత
దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రహసనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, ఎన్నికల సంఘం ద్వారా ఓట్లను కొల్లగొట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాథమిక హారమైన ఓటు హక్కును కాలరాసే విధంగా సీఈసీ వ్యవహరిస్తున్న తీరు దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఇలాంటి ఉన్నతాధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరించారు.
*విపక్షాల అల్టిమేటం: 24 గంటల గడువు.. దేశవ్యాప్త ఉద్యమం
సీఈసీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదం తొక్కుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీతో సహా పలు ప్రతిపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువులను తుంగలో తొక్కిన సీఈసీకి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అక్టోబర్ 2 నుంచి ముంబై కేంద్రంగా ప్రారంభమై దేశవ్యాప్తంగా ఉద్ధృత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకుల నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించి, ప్రజా తీర్పును తారుమారు చేశారని విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఓటర్ల జాబితా పవిత్రతను కాపాడేందుకు, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని రక్షించేందుకు యావత్ దేశం ఏకమై ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది.



