- ఇంటి నుండి వెళ్ళిపోయిన భర్త..
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేరెడ్మెట్ పోలీసులు..
నేరెడ్మెట్:
భార్యతో గొడవపడి ఇంటి నుండి భర్త వెళ్ళిపోయిన ఘటన నేరెడ్మెట్ పోలిస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపిడొ నడుపుతూ జీవనం సాగిస్తున్న నాగరాజ్ (34) అనే వ్యక్తి తన భార్య మానసతో కలిసి వినాయక్ నగర్లో నివసిస్తుండేవారు. అయితే ఈనెల 20న భార్య, భర్తల మధ్య ఉదయం 10 గంటల సమయంలొ సెల్ ఫోన్ విషయంలో గొడవ జరిగింది. దానితో మనస్తాపానికి గురైన నాగరాజు ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఎన్నిసార్లు కాల్స్ చేసిన లిఫ్ట్ చేయక పోవడంతొ గురువారం తన భర్త కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది మానస. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


